GNTR: గుంటూరు రూరల్ మండలం మల్లవరంలో శనివారం రాత్రి రచ్చబండ కార్యక్రమం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాలలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం వైసీపీ గ్రామ కమిటీల నియామకం కూడా పూర్తయింది.