ప్రకాశం: ఒంగోలులో శనివారం రాత్రి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను, ట్రావెల్స్ బస్సులను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. మంగమూరు రోడ్డు వద్ద రాకపోకలు సాగిస్తున్న స్కూలు బస్సుల , ట్రావెల్స్ బస్సుల రికార్డులను ఆయన పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా రహదారులపై తిరుగుతున్న వాహనాలపై తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.