HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 18 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా పైప్ లైన్ విస్తరణ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు.