E. G: రాజానగరం నియోజకవర్గం ఆవ భూముల పోరాట యోధుడు అడపా శ్రీనివాస్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు పలు విషయాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆవ భూములకై చేస్తున్న పోరాటం వృథా కాదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని శ్రీనివాస్‌కి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది.