BDK: మత్తుపదార్థాల వినియోగం రవాణాపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సీఐ ప్రతాప్ తెలిపారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ‘చైతన్యం – డ్రగ్స్’పై యుద్ధం కార్యక్రమాన్ని శనివారం కొత్తగూడెం టౌన్ రామవరం ఏకలవ్య మోడల్ స్కూల్లో నిర్వహించారు. టూ టౌన్ సీఐ ప్రతాప్ హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.