కోనసీమ: సీఎం సహాయనిధి పేద ప్రజలకు అండగా మారిందని రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ పేర్కొన్నారు. మలికిపురం మండలం, విశ్వేశ్వరాయపురంలోని క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ 38 మంది లబ్దిదారులకు మంజూరు అయిన రూ. 32,13,568 విలువ గల చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, ఎన్.డీ.ఏ. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.