HYD: పంజాగుట్ట NIMS హాస్పటల్లో ఉదయం సమయాల్లో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రత్యేకంగా మెడికల్ కౌంటర్, ల్యాబ్, ఫార్మసీ వద్ద వైద్య సేవలకు వస్తున్న రోగులు ఎక్కువగా ఉండటం వల్ల కాస్త ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు అదనపు సిబ్బంది, కౌంటర్లు ఏర్పాటు చేసి, వేగవంతమైన సేవలు అందించడం ద్వారా రోగుల భద్రత, సౌకర్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.