MNCL: ప్రజా సంక్షేమానికి బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం దండేపల్లి మండలంలోని మేదరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు.