KNR: శాతవాహన విశ్వవిద్యాలయం LMD క్యాంపస్లో గల ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి రేపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.కే.శ్రీశైలం తెలిపారు. అభ్యర్థులు ఉదయం.10 గంటలకు ఉజ్వల పార్కు సమీపంలోని ఫార్మసీ కళాశాలలో హాజరు కావాలన్నారు. ఇప్పటివరకు ఎక్కడా అడ్మిషన్ తీసుకోనివారికి అవకాశం ఉంటుందన్నారు.