మూడు రోజులపాటు మొంథా తుఫాన్ దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శ్రీ విజయదుర్గ దేవి పీఠం ఉప పీఠాధిపతి డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. చెరువులు, నదుల వద్దకు, విద్యుత్ పోల్స్, శిథిలమైన ఇళ్ల వద్ద ఉండకూడదన్నారు. కాగా, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రజలకు అధికారులకు నడుమ వారధులుగా ఉంటూ సమాచారం అందిస్తున్నారని కొనియాడారు.