కోనసీమ: అంబాజీపేట మండల పరిధిలోని వక్కలంక గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ ఆదేశించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వంటి వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తం చేయాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రేవతి, పెదబాబు ఉన్నారు.