ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఇప్పుడు ఆ జట్టుతో ఐదు టీ20ల సిరీస్కు సన్నద్ధమవుతోంది. మరోవైపు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో, వారు రాబోయే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30న రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.