KKD: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్ కె ఎస్. జవహర్ జగ్గంపేట మండలం బాలికల వసతి గృహాలను ఆదివారం సందర్శించారు. దీనిలో భాగంగా జగ్గంపేటలో ఉన్న బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని పరిశీలించి, వంటశాలను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో ఉన్న లోటుపాట్లను అడిగి తెలుసుకుని, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.