HYD: చాదర్ఘాట్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్ మెన్ VSN మూర్తిలను సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.