ADB: స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవకు ముందుకురావడం గొప్ప విషయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల మయమైన లింగాపూర్ గ్రామానికి వెళ్లే మార్గానికి మరమ్మత్తులు చేపట్టిన రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.