NZB: భీమగల్ లింబాద్రిగుట్ట శ్రీవారి నిత్య బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నింభాచల క్షేత్రదేవీ అయిన చండిక దేవికి (పెద్దగంటి ఎల్లమ్మ తల్లి) నరసింహ స్వామి పెళ్లి కొడుకు అయ్యేందుకు శేష వస్త్రాలు, సుమంగళి సారే సమర్పించారు. సోమవారం గ్రామాలయం నుంచి శ్రీవారు గుట్టపైకి మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరుతారని నిర్వాహకులు తెలిపారు.