KMM: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. వచ్చిన అభ్యర్థుల నైపుణ్యాలు పరిశీలిస్తూ వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థలు చురుకుగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి, సింగరేణి డైరెక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు.