సత్యసాయి: మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు బుక్కపట్నం మండలం రాసింపల్లిలో నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.