CTR: కార్వేటి నగరం మండల పరిధిలోని కోటార్వేడు దళితవాడలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాలుగు ఇళ్ల వద్ద వర్షపు నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారి వీఆర్వో బాబు రెడ్డి తక్షణమే 4 కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం మూడు రోజులకు సరిపడా కూరగాయలు, బియ్యం, పంపిణీ చేసి భోజన సదుపాయం కల్పించారు.