CTR: ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యురు హరిజనవాడలో మొంథా తుఫాన్ కారణంగా ఓ మహిళ ఇల్లు కోల్పోయింది. మంగళవారం GD.నెల్లూరు ఎమ్మెల్యే డా. ధామస్ పెద్దతయ్యూరు గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకుని ఆమెకి ప్రభుత్వం తరఫున రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.