E.G: ఉండ్రాజవరం మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇబ్బందికర ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.