SRD: ఖేడ్ డివిజన్ వీర శైవ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో 14వ కార్తిక మాసం వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు సిద్దయ్య స్వామి తెలిపారు. ఆదివారం ఖేడ్‌లోని సంఘం ఆఫీసులో సభ్యుల సమావేశం నిర్వహించి చర్చించారు. తుర్కపల్లి సంగమేశ్వర ఆలయం అమృత గుండంలో నవంబర్ 9న కార్తీక దీపోత్సవం, గంగా హారతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు ఉన్నారు.