NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం ఆదివారం జరిగింది. సొసైటీ ఛైర్మన్గా నల్లూరు అప్పారావు, సభ్యులుగా బొడ్డు చిన్నమ్మాయి, షేక్ ముస్తఫా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొని త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.