NLG: చిట్యాల లోని పదో వార్డులో యువశక్తి యువజన సంఘం సభ్యులు సిలివేరు చంద్రశేఖర్, కంబాలపల్లి నరేష్ జ్ఞాపకార్ధం ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నల్గొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూచించారు.