NLR: తుఫాను నేపథ్యంలో పెన్నా నది పరివాహక ప్రాంతమైన చేజర్ల, అనంతసాగరం, సంగం మండలం పట్ల అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆనం తెలిపారు. పెన్నా, బొగేరు, బీరాపేరు మూడు నదుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎటువంటి ముప్పునైన ఎదుర్కొనేందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు.