GDWL: మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెండి తొడుగుల కోసం 108 కిలోల వెండి సేకరణలో భాగంగా, ఆదివారం బెంగళూరుకు చెందిన భక్తులు విరాళం అందించారు. భీమన్న, జయలక్ష్మి దంపతులు స్వామివారికి 100 గ్రాముల వెండిని సమర్పించి దేవస్థానం వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వాల్మీకి పూజారులు చంద్రశేఖర్ రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.