ADB: సమిష్టి నిర్ణయాలతోనే సంఘం అభివృద్ధి సాధ్యమని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. మావల మండల కేంద్రంలోని సంఘ భవన సమీపంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. రానున్న రోజుల్లో జిల్లాలోని ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు.