BDK: పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని కోయగట్టు ఆదివాసీ గ్రామంలో నేడు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పర్యటించారు. మట్టి ఇటుకల తయారీ ద్వారా ఉపాధి పొందడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని, మట్టి ఇటుకల తయారీపై అవగాహన కల్పించారు. వారితోపాటు ఎంపీడీవో, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.