MBNR: గండీడ్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యాలయంలో వర్షపు నీరు నిలువ ఉండడానికి గమనించి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌కు షో కాజ్ నోటీస్ ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. దోమలు రాకుండా పరిసరాలను శుభ్రం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.