GNTR: తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు వరి రైతులకు అత్యవసర సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా పొలాలు ముంపునకు గురైతే, వెంటనే నీటిని బయటకు పంపాలి. వాలిపోయిన పైరును దుబ్బులు కట్టి నిలబెట్టి, ఆ తర్వాత యూరియా, పొటాష్ ఎరువులను మోతాదులో వాడటం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు.