KMM: మధిర పట్టణంలో మెయిన్ రోడ్డును ఆక్రమించిన దుకాణాలను ఆదివారం మున్సిపల్ అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా రహదారి ఆనుకొని ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను పోలీస్ సహకారంతో తొలగిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. లేనిచో మున్సిపల్ చట్టం 2019 ప్రకారము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.