యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి మోడ్రన్ రైస్ మిల్ను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ప్రారంభించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం, పామనగుండ్ల గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డే సైదిరెడ్డి రైస్ మిల్లును నిర్మించారు.