TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఈనెల 30 నుంచి 4 రోజులపాటు జూబ్లీహిల్స్‌లోని ఆయా డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 30, 31న, నవంబర్ 4, 5న రోడ్‌షోలు ఉండనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సాయంత్రం వేళ రోడ్‌షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో డివిజన్లో ఒకటి రెండు చోట్ల ఆయన ప్రసంగించనున్నారు. అందుకోసం మంత్రులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు.