CTR: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. చిత్తూరు ఎస్పీ బంగ్లాలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి దుశ్శాలువతో ఎస్పీని సత్కరించారు. అనంతరం కొంతసేపు వారిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు తదితరులు పాల్గోన్నారు.