KNR :కరీంనగర్ కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్‌కు సంబంధించిన డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.