MHBD: సీరోల్ మండల రైతు వేదికలో ఇవాళ మండల వ్యవసాయ అధికారి ఛయరాజ్ మాట్లాడుతూ.. రైతులు సబ్సిడీపై అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మండలానికి 84 బ్యాటరీ స్ప్రేయర్లు, 15 పవర్ స్ప్రేయర్లు, 6 రోటవేటర్లు తదితర యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.