KNR: హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం కబ్రిస్తాన్లో పిచ్చిమొక్కలు, తుమ్మ చెట్లు పెరగడంతో ఖననం చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కోరారు. కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో సభ్యులు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.