RR: షాద్నగర్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణానికి రూ.5.31 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.