KMR: మద్నూర్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా కొనసాగనున్నాయి. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద అధికారులు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని రైతులు తాము పండించిన పత్తి పంటను అమ్ముకోవచ్చని సూచించారు. యాప్ ద్వారా పంట అమ్మకానికి గల ఉపయోగాలు, వాటిపై అవగాహన కల్పించుటకు సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలపారు.