SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి, ఖేడ్, సిర్గాపూర్, మనూర్, నాగల్ గిద్ద మండలాల నుంచి కర్ణాటకలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఇవాళ బీదర్ సమీపంలోని మన్నెకెళ్లి నుంచి పాదయాత్ర కొనసాగిందని దత్త దీక్ష స్వాములు ఆదివారం తెలిపారు. వచ్చే బుధవారం దత్త క్షేత్రానికి చేరుకుని తమ మొక్కులను చెల్లించుకుంటామని పేర్కొన్నారు.