HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు కేటాయించిన ‘ప్రీ సింబల్స్’ BRSను చిక్కుల్లోని నెట్టాయి. ఇండిపెండెంట్లకు కేటాయించిన కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి చిహ్నాలు కారును పోలి ఉన్నాయని BRS నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈసారి బ్యాలెట్లో అభ్యర్థి ఫొటో కూడా ఉండటం వలన ఓటర్లలో గందరగోళం తగ్గే అవకాశం ఉంది.