మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా కుక్కలు తిరుగుతూ వృద్ధులు, మహిళలు, చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వచ్చిపోయే ద్విచక్ర వాహనదారులను కూడా కరుస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.