MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రంలో ఆదివారం వన దుర్గమ్మకు ప్రధానార్చకులు శంకర్ శర్మ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర జలంతో అభిషేకం చేశారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.