నిరాశ్రయులు, పేదల కష్టాలు పోగొట్టేందుకు రాజ కుటుంబం తరఫున ప్రయత్నించిన థాయ్‌లాండ్ రాజమాత, గతంలో రాణిగా సేవలందించిన సిరికిత్ కితియకారా తుదిశ్వాస విడిచారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా బ్యాంకాక్‌లోని ఆస్పత్రిలో 93 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారని థాయ్‌లాండ్ రాజకుటుంబ వర్గాలు ప్రకటించాయి. ప్రధాని అనుతిన్ ఛార్న్ విరాకుల్ సంతాపం ప్రకటించారు.