అమెరికా అధ్యక్ష పదవిపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్‌లో అమెరికా అధ్యక్షురాలిగా ఒక మహిళ వైట్‌హౌస్‌లో ఉండడం ఖాయమని, బహుశా అది నేనే కావచ్చు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ట్రంప్ ఫాసిస్ట్ ధోరణితో వ్యవహరిస్తారని హెచ్చరించినట్లు గుర్తుచేశారు.