AP: భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పాఠశాలలకు అధికారులు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. ‘ఈనెల 27, 28, 29న పాఠశాలలకు సెలవులు ఉంటాయి. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. సోమవారం జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేశాం. కంట్రోల్ రూమ్ నెంబర్ 0863 22340414. మండలాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.