PDPL: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన అవసరమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కుంచాల సునీత అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, రాజ్యాంగం, హక్కులు, న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె సూచించారు.