KMM: కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు భూక్య భీమా అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ శనివారం భీమా మృతదేహంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.