ADB: ఆదిలాబాద్ అభివృద్ధి పనులకు రూ.15కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.