PLD: రెంటచింతల బైపాస్ వద్ద శనివారం రాత్రి వేగంగా వచ్చిన ఒక సిమెంట్ లారీ అదుపు తప్పి గొర్రెల మందపైకి దూసుకురావడంతో పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బైపాస్ మార్గంలో లారీ వేగంగా వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.